పదవతరగతి ఫలితాల్లో విజయకేతనం

పదవతరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసిన వెల్దుర్తి బి.సి బాలికల వసతి గృహ విద్యార్థినీలు
వెల్దుర్తి, ఏప్రిల్ 22, (SK1NEWS):
పదవతరగతి పరీక్షల ఫలితాలలో కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని బీ.సి బాలికల వసతి గృహ విద్యార్థినిలు విజయ దుందుభి మోగించారు. వసతి గృహంలోని విద్యార్థి నీలు తొంభై ఐదు మంది పదవతరగతి పరీక్షలు హాజరైతే తొంభై రెండు మంది ఉత్తీర్ణత సాధించారు 12 మంది విద్యార్థినీలు ఐదువందల పైచిలుకు మార్కులతో సంచలన విజయం నమోదు చేశారు. అరవై రెండు మంది ప్రధమ శ్రేణిలో , ఇరవై ఆరు మంది ద్వితీయ శ్రేణి లో , నలుగురు తృతీయ శ్రేణిలో విజయం సాధించారు.దాదాపు తొంభై ఏడు శాతం పాస్ పర్సంటేజ్ సాధించారు. ఈ సందర్భంగా బాలికల వసతి గృహ అధికారిణి శైలజ మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో ఎక్కువమంది నిరుపేద రైతుల మరియూ రైతు కూలీల పిల్లలు చదువుతున్నారని వారు కష్టపడి చదివి ఈ రోజు తల్లి తండ్రుల కష్టం, కన్నీటి ని అర్థం చేసుకొని మంచి విజయం సాధించారని వారు గొప్ప విజయం సాధించేల ఎంతో ప్రోత్సహించాలని శైలజా తెలిపారు. ముఖ్యంగా టి. సౌమ్య 576 మార్కులు, పి చాంద్ బి 555 మార్కులు, కే నాగలక్ష్మి 541, మార్కులు సాధించి చాలా గొప్ప విజయం సాధించారని ప్రభుత్వ పాఠశాలలో గొప్ప సంస్కారవంతమైన విద్య ఉందని నిరూపించారని అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించేలా ప్రోత్సహించాలని ఆమె తల్లిదండ్రులను కోరారు. వసతి గృహంలో విజయం సాధించిన విద్యార్థినిలు అందరికీ పేరుపేరునా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వసతి గృహంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటిని అధికారులు, నాయకులు, ప్రజలు దృష్టి పెట్టి సమస్య లేకుండా చేసుకోవాలని ఉత్తమ వసతి గృహంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా బాలికల వసతి గృహ అధికారిణి శైలజను పలు స్వచ్ఛంద సేవ సంస్థలు, అధికారులు, నాయకులు అభినందించారు. విద్యార్థినిలు గొప్ప విజయం సాధించడానికి వసతి గృహాధికారిణి శైలజ ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసిందని హెల్పింగ్ హ్యండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహానాయుడు అన్నారు.



