ANDHRA

ఆర్డీవో కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు

నూతన ఆర్టీవో కార్యాలయం ఎమ్మెల్యే శిల్పా చొరవతోనే సాధ్యం ..

నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్డర్

ఆత్మకూరు టౌన్, ఏప్రిల్ 04, (SK1 NEWS HD) :

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కరివేన గ్రామ సమీపంలో నూతన రెవెన్యూ డివిజన్ అధికార కార్యాలయాన్ని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో ఎం. దాసు ను అభినందించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరులో రెవిన్యూ డివిజన్ గా చేయడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గం ప్రజల పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని మీ ప్రాంతంలో నూతన ఆర్డీవో కార్యాలయం ను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు పాస్ బుక్ లు కావాలంటే భూమి సమస్యలు తెలుసుకోవడానికి కర్నూలు వెళ్ళవలసి ఉండేది. ప్రజల ఎన్నో దశాబ్దాల కల సాకారం చేసిన మా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవతో సాధ్యమైందన్నారు. ఆర్డీవో ఎం. దాస్ మాట్లాడుతూ… ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు భువనేశ్వర్ రెడ్డి, మండల ఎంపిపి ఎన్. తిరుపాలమ్మ, సింగిల్విండో చైర్మన్ సురేష్, మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
FacebookTwitterEmailWhatsAppShare

SK1 News

Related Articles

Back to top button
error: Content is protected !!