మొహరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి

మొహరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి
వెల్దుర్తి ఎస్సై పి చంద్రశేఖర్ రెడ్డి
వెల్దుర్తి, జూలై 26, (SK1 NEWS HD) :
వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో నేటినుండి 29 వ తేదీ వరకు జరుగు మొహరం వేడుకలు ప్రజలందరూ సంతోషంగా సామరస్యంగా స్నేహపూరిత వాతావరణంలో జరుపుకోవాలని వెల్దుర్తి ఎస్సై పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మొహరం వేడుకల్లో ముఖ్యంగా విద్యుత్ తీగల పట్ల అగ్నిగుండం చుట్టూ వేడుక తిలకించే మహిళలు ,వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని,ఏలాంటి అపశ్రుతులు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. గ్రామాల్లో ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తామని తెలిపారు. మొహరం వేడుకల్లో చిన్న సర్కేస్, పెద్ద సర్కేస్, పీర్లు ఏటికి పోయే కార్యక్రమాల్లో మద్యం తాగి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే ఆ గ్రామ పీర్ల కార్య నిర్వాహకులు బాధ్యత వహిస్తారని, అలాంటి వారిని గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య మీ దృష్టికి వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సొంత నిర్ణయాలతో చట్టాన్ని వారి చేతిలోకి తీసుకొని, గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, తెలిపారు. గ్రామాల్లో శాంతియుతంగా మత సామరస్యంగా అందరూ సుఖసంతోషాలతో పండుగ వేడుకలు జరుపుకోవాలని కోరారు. మొహరం పండుగ జరిగే ప్రతి కార్యక్రమం పై పోలీసు నిఘా గట్టిగా ఉంటుందని అనవసరపు గొడవలు సృష్టిస్తే తదుపరి ఆ గ్రామాల్లో పండుగ అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు.



