ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకం

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకం

శ్రీశైలం, జూలై 26, (SK1 NEWS HD):

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లోక కళ్యాణం కోసం దేవస్థానం వారు మంగళవారం రోజున ఉదయం ఆలయ ప్రాంగణంలోని కుమార స్వామి వారి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషాలు పూజాదికాలు నిర్వహించబడ్డాయి. ప్రతి మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం, షష్టి తిధి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ విశేషాభిషేక మరియు పూజారికాలు నిర్వహించబడతాయి. దేవస్థానం వారు ఈ పూజలు సర్కారీ సేవగా స్వామివారికి నిర్వహిస్తారు. కుమారస్వామి వారికి పూజలు జరపడం వలన లోక కళ్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో శత్రుభాధలు గ్రహ పీడలు దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతాన భాగ్యం లభిస్తుంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిచి పంటలు బాగా పండాలని పాడి సమృద్ధిగా ఉండాలని జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని జనులందరూ సుఖసంతోషాలతో ఉంటూ అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ జరిపించబడింది. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము అర్చన తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణాలు చేయబడ్డాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకంతో స్వామివారికి పంచామృతాలైన పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరినీళ్లు మరియు వివిధ పండ్ల రసాలైనా దానిమ్మ కమలా ద్రాక్ష అరటి మొదలైన వాటితో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వివిధ పళ్ళ రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.

Related Articles

Back to top button
error: Content is protected !!