
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెం. 08514 – 294898
అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
నంద్యాల ప్రతినిధి, జులై 26, (SK1 NEWS HD) :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా తుఫాన్ ప్రభావ నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల వల్ల జిల్లాను రెడ్ అలెర్ట్ గా ప్రకటించిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, వ్యవసాయ అధికారులు, ఆర్డీఓలు, తాశీల్దార్లు, ఎంపీడీఓలు, తదితర మండల గ్రామస్థాయి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి అధిక వర్షాల వల్ల ప్రజలు ప్రమాద బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వాగులు, వంకలు, నదులకు గండ్లు పడకుండా పరివాహక ప్రాంతాలలో పర్యటించి ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరేవేసేందుకు సంబంధిత మండల తాసిల్దారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెం. 08514 – 294898.
తుఫాన్ ప్రభావిత కారణంగా ఏదైనా సమాచారం కొరకు జిల్లా కలెక్టరేట్ లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. ప్రజలు ఏదేని సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ నెం. 08514 – 294898 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చన్నారు. కంట్రోల్ రూమ్ ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.



