టిడిపి నగర అధ్యక్షుడిగా నాగరాజు యాదవ్
టిజి భరత్ సమక్షంలో బాధ్యతలు చేపట్టిన నాగరాజు యాదవ్

టిడిపి నగర అధ్యక్షుడిగా టిజి భరత్ సమక్షంలో బాధ్యతలు చేపట్టిన నాగరాజు యాదవ్
కర్నూలు ప్రతినిధి, జూలై 23, (SK1 NEWS HD) :
కర్నూలులో పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని కర్నూలు నగర టిడిపి అధ్యక్షుడు నాగరాజు యాదవ్ కు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ సూచించారు. గత నెల 29వ తేదీన కర్నూలు నగర అధ్యక్షుడిగా పి. నాగరాజు యాదవ్ ను టి.జి భరత్ నియమించారు. ఆయన శుక్రవారం మౌర్య ఇన్లోని టిజి భరత్ కార్యాలయంలో ఆయన సమక్షంలో నగర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యాదవ సంఘంలో మంచి ప్రాబల్యం కలిగిన నేత అయిన నాగరాజు యాదవ్ ను కర్నూల్లో టిడిపిని పటిష్టం చేసే ఉద్దేశంతోనే నగర అధ్యక్షుడిగా నియమించినట్లు ఈ సందర్భంగా టిజి భరత్ తెలిపారు. కర్నూల్లో టిడిపి బలోపేతానికి కష్టపడి పనిచేయాలని ఆయనకు భరత్ సూచించారు. పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. క్రమశిక్షణతో పనిచేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోవాలన్నారు. ఇక తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన టిజి భరత్ కు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.



