
వర్షాకాలంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి
ఎస్సై నాగమలేశ్వర రావు
కంభం, జూలై 22, (SK1 NEWS HD) :
ప్రకాశం జిల్లా కంభం మండలం ఎస్సై నాగమలేశ్వర రావు స్థానిక ప్రజలకు ప్రస్తుతం వర్షాకాలం సందర్భంగా పలు సూచనలు సలహాలు తెలిపారు.ప్రయాణ సమయం లో రోడ్డు తడిసి ఉండుట వలన ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయ్యే సందర్భాలు ఎదురవుతాయని,అధికవేగాన్ని తగ్గించి పరిస్థితులను బట్టి వేగాన్ని అదుపు చేసుకోవాలని తెలిపారు.వర్షాలకు కంటిలో నీరు పడుట వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక హెల్మెంట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.నిబంధనలను ఉల్లఘించక వాటిని పాటిస్తూ ప్రయాణాలు చేయటం సురక్షితం అని తెలిపారు.అలానే స్థానిక పట్టణ ప్రజలకు వర్షాకాలంలో ప్రయాణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు తెలిపారు.



