గోల్డ్ షాప్ యజమానులు పోలీసుల నిబంధనలు పాటించాలి
ఆత్మకూరు డి ఎస్ పి శ్రీనివాసరావు

గోల్డ్ షాప్ యజమానులు పోలీసుల నిబంధనలు పాటించాలి
ఆత్మకూరు డి ఎస్ పి శ్రీనివాసరావు
నందికొట్కూరు , జులై 21, (SK1 NEWS HD) :
పట్టణంలో ఉన్న గోల్డ్ షాపుల యజమానులు పోలీసుల నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆత్మకూరు డి ఎస్ పి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆత్మకూరు డి ఎస్ పి ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణ సి ఐ ఓ విజయభాస్కర్ గోల్డ్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ పి మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో ఉన్న గోల్డ్ షాపుల యజమానులతో సమావేశాన్ని నివాహిస్తున్నామన్నారు. గోల్డ్ షాపుల్లో వాడే యాసిడ్ ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారు, ప్రతి రోజు ఎంత మొత్తంలో వాడుతున్నారు. ప్రతి రోజు వాడే వివరాలు నమోదు చేసుకోవాలని ఆ వివరాలు పోలీసులకు ఇవ్వాలన్నారు. ఇందుకు సంబందించిన లైసెన్స్ లు కూడా ప్రతి ఒక్కరి వద్ద ఉండాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ గోల్డ్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు, సురేష్, చంద్ర శేఖర్, నాగేంద్ర, గౌడ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.



