ANDHRABREAKING NEWSPOLITICSSTATE

పేదలకు మరింత చేరువయ్యేందుకు జగనన్నసురక్ష లక్ష్యం

పేదలకు మరింత చేరువయ్యేందుకు జగనన్నసురక్ష లక్ష్యం : జడ్పిటిసి సుంకన్న

వెల్దుర్తి, జూలై 21,( SK1NEWS HD) :

ప్రభుత్వం పేదలకు మరింత చేరువయేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం అని జడ్పిటిసి సుంకన్న అన్నారు.
మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని రెండవ సచివాలయ పరిధిలో జగన్ అన్న సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేసిన ఏకంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని నిలిచిందని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని మరల 2024లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగనన్ననే సీఎం అవుతారని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు అప్లై చేసుకున్న దృవపత్రాలను లబ్ధిదారులకుఅందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, పంచాయతీ సెక్రెటరీ నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SK1 News

Related Articles

Back to top button
error: Content is protected !!