ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATEWORLD

ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో  మెలగాలి

ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో  మెలగాలి
తాటిపాడు మహబూబ్ సాహెబ్
కర్నూలు, జూలై 15, (SK1 NEWS HD):
జీవితంలో ప్రతి ఒక్కరు సేవా దృక్పథం తో నడుచు కోవాలని కర్నూలు జిల్లా ప్రైవేటు గోడోన్స్ జిల్లా అద్యక్షులు,రబ్బానీ గ్రూప్ చైర్మన్ తాటిపాడు మహబూబ్ సాహెబ్ అన్నారు.శనివారం కర్నూలు నగరంలోని కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో అంకురం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో గ్లోబల్ ప్రింటర్స్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు కు చెందిన తాటిపాడు మాబు సాహెబ్, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడెమీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సయ్యద్ నూరుల్లా ఖాద్రి, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మాజీ సభ్యులు మెహమూద్ పాషాలు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో  ప్రింటింగ్ యూనిట్ ప్రారంభించడం చాలా సంతోషించతగ్గ విషయని ,స్ధానిక పత్రికలు సుదూర ప్రాంతాలకు వెల్లకుండా  యూనిట్ అవకాశం కల్పిస్తుందని,  ఈ అవకాశాన్ని స్ధానిక పత్రికల యాజమాన్యాలు అందరూ ఉపయోగించుకోవాలన్నారు. పాత్రికేయులు అందరు ఒకరి నొకరు పరస్పర సహకారం అందించుకుని ఆర్ధికంగా ఎదగాలని కోరారు. అనంతరం ప్రింటింగ్ యూనిట్ వ్యవస్ధాపకులు యస్.మస్తాన్ వలి మాట్లాడుతూ స్ధానిక పత్రికల యాజమాన్యాలు తమ  పత్రికల ప్రింటింగ్  కొరకు సుదూర ప్రాంతాలకు వెల్లకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా  తక్కువ ధరలకే ప్రింటింగ్  అందిస్తామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లోని వివిధ జర్నలిస్ట్ సంఘాల అధ్యక్షులు పలు స్ధానిక పత్రికల యాజమాన్యాలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!