జనం కోసం సిపిఎం…ఇంటింటికి సీపీఎం

జనం కోసం సిపిఎం…ఇంటింటికి సీపీఎం
బుచ్చిరెడ్డిపాలెం,జూన్13,(SK1 NEWS HD) :
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం ప్రజా సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపేందుకు చేపట్టిన జనం కోసం సిపిఎం ఇంటింటికి సిపిఎం కార్యక్రమం ప్రారంభమైంది.సీపీఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.ఇంటింటికి తిరిగే సమయంలో ప్రజలు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు కు జీవనం కష్టసాధ్యంగా ఉందని అన్నారు. దానికి తోడు గ్యాస్ ధరను పెంచడం వల్ల బ్రతుకు బండి ఈదడం కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.ధరలు పెంచారు కానీ కూలి చేసుకునే కూలీల కూలి మాత్రం పెంచలేదు అని ఇలా ఎలా బ్రతకాలని వారు విన్నవించుకున్నారన్నారు. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకు వెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలిపి రానున్న కాలంలో ప్రజలు రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలా వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పోతంశెట్టి శ్రీనివాసులు, నాయకులు షేక్ జానీ భాష, షేక్ మునీర్ అహ్మద్, ఆరి మాల్యాద్రి, చల్ల కొలుసు మల్లికార్జున్, డివైఎప్ఐ నాయకులు కొమ్మి శ్రీనివాసులు, దుర్గా ప్రసాద్, ఐద్వా నాయకులు ఒంటెరు రమణమ్మ, చలంచర్ల జయమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు.



