ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి :

ఏఎస్ పేట ఎస్ఐ షేక్ సుభాని

స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి :

ఏఎస్ పేట ఎస్ఐ షేక్ సుభాని

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 13, (SK1 NEWS HD):

ఓటు కలిగిన ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా , స్వేచ్చగా వినియోగించుకోవాలని ఏఎస్ పేట ఎస్ఐ షేక్ సుభాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ పేట టౌన్ లో సిఆర్పిఎఫ్ పార మిలిటరీ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 23న నిర్వహించే ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఉండాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని అన్నారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నామన్నారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు ఈ కవాతు కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిఆర్పిఎఫ్ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…..

Related Articles

Back to top button
error: Content is protected !!