ANDHRABREAKING NEWSPOLITICSSTATE

ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది

టిజి భరత్

పార్టీ బలోపేతంలో క్లస్టర్ ఇంఛార్జీల పాత్ర ఎంతో కీలకం… టిజి భరత్

కర్నూలు జిల్లా న్యూస్ (SK1 NEWS HD ):

పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. గురువారం నగరంలోని మౌర్య ఇన్ లో టిడిపి కర్నూల్ నియోజకవర్గ క్లస్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఫరూక్, కర్నూల్, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నేతలు, కార్యకర్తల పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ టిడిపిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. క్లస్టర్ ఇంచార్జ్ ల పాత్ర ఎంతో కీలకమన్నారు. దాదాపుగా అన్ని క్లస్టర్లకు ఇంఛార్జీలను నియమించామని.. మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇక పార్టీకి గ్రౌండ్ వర్క్ చాలా ముఖ్యమైనదన్నారు. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఇప్పటినుండే కష్టపడి పనిచేయాలన్నారు. ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంతో కార్యకర్తలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. త్వరలో బూత్ లెవల్ నాయకులతో సమావేశాలు పెట్టి.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటానన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!