ANDHRABREAKING NEWSPOLITICSSTATE

తనను ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిపించాలి : మేకపాటి విక్రమ్ రెడ్డి

గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

తనను ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిపించాలి : మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు ఉప ఎన్నికలలో తనను ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిపించాలి

ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు ఉపయోగపడేలా తన వంతు కృషి చేస్తా

మేకపాటి విక్రమ్ రెడ్డి

నందవరంలో ఒంటెద్దు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి కు స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు భారీ గజమాలలతో
ఘన స్వాగతం

ఆత్మకూరు , మర్రిపాడు, జూన్ 08, (SK1 NEWS HD) :

ఆత్మకూరు ఉప ఎన్నికలలో తనను ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో మేకపాటి విక్రమ్ రెడ్డి కోరారు. మర్రిపాడు మండలంలోని డీసీపల్లి,నందవరం, రాంపల్లి,పొంగూరు, పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు తన గెలుపుకు శ్రీకారం చుట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా విజయం సాధించి గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు ఉపయోగపడేలా తన వంతు కృషి చేస్తానన్నారు. అన్నా మేకపాటి గౌతంరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేయడం కూడా జరిగిందని తెలిపారు.ఈనెల 23వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకుని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం జగన్ మోహన్ రెడ్డి కు కానుకగా అందించాలని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.అనంతరం ఒంటెద్దు కిష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు
భారీ పూల గజమాలలతో పూల వర్షంతో స్వాగతిస్తూ అలాగే మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతించారు. ఈ కార్యక్రమంలో
నందవరం ఎంపీటీసీ నూనె లక్ష్మీప్రసాద్, మండల మైనార్టీ వైఎస్సార్ పార్టీ నాయకులు షేక్ ఖాదర్ బాషా, కోనంకి శ్రీనివాస్ నాయుడు,
వై,చిన్న రెడ్డి, గాలి బోయిన,రామ్మోహన్, మండల వైసిపి నాయకులు గంగవరపు శ్రీనివాసనాయుడు,
అమర్నాథ్ రెడ్డి, సిద్ధం రెడ్డి మోహన్ రెడ్డి, మండల వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!