
కల్లూరు,కర్నూలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఎసిబి దాడులు
కర్నూలు , ఏప్రిల్ 29, (SK1 NEWS HD) :
కర్నూలు నగరంలోని కర్నూలు,కల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై బుధవారం ఎసిబి డిఎస్పీ శివనారాయణ స్వామి,అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.ఈ సందర్బంగా స్థానిక డాక్యుమెంట్ రైటర్స్ దుకాణాలు మూసివేసి పరారి అయ్యారు.రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ ను లను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కార్యాలయంలో పత్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎసిబి అధికారులు మాట్లాడారు.రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అక్రమాలు జరిగినట్లుగా బాధితులు చేసిన పిర్యాదు మేరకు దాడులు సాగించినట్లు చెప్పారు.ఈ దాడుల్లో కల్లూరు కార్యాలయంలో రూ.55,660, కర్నూలు నందు రూ.40,470 లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.ప్రజలు 14400 నంబర్ ను సద్వినియోగం చేసుకుని అవినీతి,అక్రమాలు
జరగకుండా ఎసిబి అధికారులకు పిర్యాదు చేయాలనీ డిఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో సిఐలు తేజేశ్వర్ రావు, కృష్ణయ్య,వెంకట కృష్ణారెడ్డి, వంశీనాధ్,ఇంతియాజ్,ఎస్సై లు వెంకట రెడ్డి,ఎస్.ఎం బాషా,ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



