
ఏఎస్ పేట ఎస్ఐ సుభానికు ప్రశంసాపత్రం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 29, (SK1 NEWS HD) :
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు పట్టణంలో ఈ నెల 24 తేదీన జరిగిన శ్రీ హనుమాన్ శోభయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధి నిర్వహణలో మంచి ప్రతిభ చాటిన ఏఎస్ పేట ఎస్ఐ షేక్ సుభాని కు శుక్రవారం నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయ రావు ఏఎస్పీ వెంకటరత్నం ఎస్ఐ షేక్ సుభాని కు ప్రశంసా పత్రం షీల్డ్ బహూకరించి అభినందించినట్లు ఎస్ఐ షేక్ సుభాని ఏఎస్ పేట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎస్ఐ సుభాని కు ఆత్మకూరు డిఎస్పి వెంకటేశ్వరరావు, సీఐ వేణుగోపాల్ రెడ్డి స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది అభినందించారు.



