ANDHRABREAKING NEWSPOLITICSSTATEWORLD

మహిళా రైతుల అభివృద్ధి కోసమే పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం హర్షణీయం

మహిళా రైతుల అభివృద్ధి కోసమే పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం హర్షణీయం

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కర్నూలు జనసేన నాయకులు

కర్నూలు టౌన్, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

మహిళా రైతులను మరింత అభివృద్ధి పరిచే దిశగా వ్యవసాయాభివృద్ధి కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైలెట్ ప్రాజెక్టు తెరపైకి తీసుకురావడం హర్షణీయమని ఆ పార్టీ రాయలసీమ రీజన్ వీర మహిళ కోఆర్డినేటర్ హసీనా బేగం, ఆ పార్టీ నాయకులు మహబూబ్ బాషా, నక్కల మిట్ట శ్రీనివాసులు అన్నారు. మంగళగిరి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాయలసీమ ప్రజలకు చెందిన నాయకులు, వీర మహిళా కోఆర్డినేటర్లు అందరూ నాదెండ్ల మనోహర్ కలిసి చర్చించారు ఈ సందర్భంగా కర్నూలుకు చెందిన హసీనా బేగం మహబూబ్బాషా , నక్కల మిట్ట శ్రీనివాసులు పలు విషయాలు నాదెండ్ల మనోహర్ తో చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తారని పండించిన పంటకు వాడే విస్తరించుకుని తమ కాళ్ళపై తాము నిలబడేలా స్వశక్తితో జీవిస్తారని అన్నారు. నాలుగు గోడల మధ్య ఉండే బయటకు వచ్చి స్వంతంగా డబ్బును సంపాదించే విధంగా వ్యవసాయ రంగంలో వజ్ర గ్రాముల నిలిచేందుకు ఈ పైలెట్ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలు మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు జనసేన పార్టీ అధినేత ఈ ఫోటోలో నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు అని అన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ముందుకు దూసుకు వెళుతోంది అని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంతోమంది మహిళలు వ్యవసాయం పట్ల మక్కువ చూపుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ కార్యాలయానికి ఎంతోమంది మహిళలు కలుస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని మహిళా వ్యవసాయ రైతులు మరింత అగ్రగామి లో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్వర్ హుస్సేన్, నిఖిల్, రాజేష్ రెడ్డి, షేక్ షా పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!