ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

ప్రతిక్షణం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహా యోధుడు నారా చంద్రబాబు నాయుడు..
ఘనంగా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు..
హోళగుంద, ఏప్రిల్20, (SK1 NEWS HD) :
మండల పరిధిలోని గజ్జహళ్ళి గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు చేతుల మీదగా కేక్ కట్ చేశారు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.40 ఏళ్ల రాజకీయ అనుభవం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనుక్షణం ప్రజల కోసం పక్షాన నిలిచిన మహానాయకుడు చంద్రన్నా అని ప్రతిక్షణం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహాయోధుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులోను అదే ఉత్సాహం తో అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథకంలో నడిపి తెలుగు ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి దేశంలోనే తెలుగు రాష్ట్రాలను ఉన్నత రాష్ట్రాలుగా తీర్చిదిద్ది అభివృద్ధి పథకాలు నడిపిన మహా నాయకుడు భావితరాల భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక తో విజన్ తో ఉమ్మడి రాష్ట్రాల ను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని ఆంధ్ర రాష్ట్రంలోని చీకటి పాలన పోయి మంచి రోజులు రావాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూజారి రామలింగ కార్యకర్తలు డి సి ,బజన్న,బికె,పంపాపతి, గొర్రెల రామలింగ, బజారి హుసేన్,శేశి,గాదిలింగ,చాకలి ముకప్ప పెద్ద కాలింగ,మరిస్వామి,మల్లయ్య, మూల్లా నబీ,దావుద్, కాశీం,దడేసూగుర్ భాషా ,హరిజన ఓమయ్య, బడేషా, పోరాడి బసవ,జి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.



