ANDHRABREAKING NEWSPOLITICS

ఇల్లు కట్టుకోవడానికి సరైన నీటి వసతి లేదు

సరైన రోడ్డు, నీళ్లు లేక అవస్థలు పడుతున్నా లబ్దిదారులు

జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకోవడానికి సరైన నీటి వసతి లేదు

సరైన రోడ్డు, నీళ్లు లేక అవస్థలు పడుతున్నా లబ్దిదారులు

హోళగుంద, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

మండలంలోని పరిధిలోని ఇంగలదహల్ గ్రామంలో జగనన్న గృహ హక్కు పథకం కింద దాదాపుగా 86 మందికి పట్టాలు రావడం జరిగింది. అందులో లబ్దిదారులు ఇళ్ళు ప్రభుత్వం ప్రకారమే నిర్మించాలని అధికారులు తెలియజేశారు.అదేవిదంగానే దాదాపు ఆరుగురు లబ్దిదారులు గత సంవత్సరమే పనులు ప్రారంబించారు. అప్పటికే సరైన రోడ్డు మార్గం లేకపోయినా ఎలాగోలా సామగ్రిని తమ స్థలాలకు చేర్చుకుని పనులు మొదలు పెట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం జగనన్న కాలనీల్లో నీటి కోసం ఒక బోర్ ను వేయించింది కానీ ఆ బోర్ ను పట్టించుకునే నాధుడే కరువయ్యారు.సమయానికి మోటార్ పంప్ బిగించక పోవడంతో అది పూర్తిగా దెబ్బతిని నీళ్లు రాకుండా పోయాయి.అధికారులకు చెప్తే మరో బోరు సచివాలయం పక్కనే వేశారు. కానీ నీళ్లు పడలేదు ఇంకా అధికారులు పట్టించుకోవడం మానేశారు.కానీ పట్టా పొందిన లబ్దిదారులు మాత్రం ఇళ్ళు నిర్మించాలని మాత్రం చెబుతున్నారు. లేకపోతే మీ పట్టా ఉండదు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని లబ్దిదారులను హెచ్చరించారు.మరో కొంతమంది లబ్దిదారులు కూడా పనులు ప్రారంభించారు కానీ వాళ్లకు రోజు రోజుకు నీటి కష్టాలు పెరిగి పోయాయి ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే వాళ్లకు చెప్తాం వీళ్లకు చెప్తాం అని కాలరాస్తున్నారు. నిన్న జరిగిన వలంటీర్ల సన్మాన సభలో ఈ లబ్దిదారులు నీటి సమస్యను విన్నవిస్తే ఎవరికో చెప్తాం అని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎవరిదరిన వారు వెళ్లిపోయారు.ఆ 10 మంది లబ్ధిదారుల్లో 5మంది మహిళలే ఉన్నారు అన్ని పనులు వారే చేయాల్సి వస్తుంది వారు ఎలా నీళ్ళు తెచ్చి నిర్మాణాన్ని పుర్తిచేయాలో అని వాపోతున్నారు.ప్రభుత్వం ఏమి కచ్చితంగా ఇల్లు నిర్మించుకోవలని అంటున్నారు కానీ సరియైన రహదారి సరియైన నీటి సౌకర్యం కల్పించడంలో మాత్రం ఎలాంటి స్పందన లేదు అధికారులలో.కావున అధికారులు ఇప్పటికైనా అధికారులు స్పందించి జగనన్న కాలనీకి రోడ్డు,నీటి సమస్యలు పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!