BREAKING NEWSCRIME

 కర్నూలు మాజీ ఎంపీపీ రాజ వర్ధన్ రెడ్డి దుర్మరణం

కర్నూలు మాజీ ఎంపీపీ రాజ వర్ధన్ రెడ్డి దుర్మరణం

కర్నూలు టౌన్, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా రెండు టైర్లు పగిలి కారు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కర్నూలు మాజీ ఎంపీపీ రాజ వర్ధన్ రెడ్డి తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారు. గాయపడ్డ రాజ వర్ధన్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ కోలుకోలేక మృతి చెందారు. వివరాల్లోకి వెళితే…కర్నూలు కోడుమూరు నియోజకవర్గo ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు రాజ వర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుండి కర్నూలుకు కారులో వస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామ శివారులోని జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న రెండు టైర్లు పాలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజవర్ధన్ రెడ్డి తెలుగుదేశంపార్టీ హయాంలో కర్నూలు మాజీ ఎంపీపీగా పని చేసి మంచి గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా తనకంటు సొంత అనుచరవర్గంతో గెలుపు ఓటముల ను ప్రభావితం చేయగల ప్రజల మనిషి గా పేరు పొందారు.

Related Articles

Back to top button
error: Content is protected !!