ఆత్మకూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆత్మకూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు
నెల్లూరు, ఆత్మకూరు, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73 వ జన్మదిన వేడుకలు ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అతిధి హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పర తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చంద్రబాబునాయుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మరల 2024లో ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని అన్నారు .ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలి అంటే చంద్రబాబు నాయుడు సేవలు ఎంతో అవసరం అని అందువలన ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల అందరిమీద ఉన్నదని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్& తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇందూరు వెంకట రమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి కేతా విజయభాస్కర్ రెడ్డి , ఆత్మకూరు మున్సిపాలిటీ 22 వ వార్డు కౌన్సిలర్ మాదాల శ్రీనివాసులు నాయుడు, తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, తెలుగు రైతు కార్యదర్శి మద్దినేని నారాయణ ,ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ తాటిపర్తి పెంచలయ్య, ముస్లిం నాయకులు గౌస్ మొహిద్దీన్, ఎం నారాయణ, షేక్ మస్తాన్, 19 వ వార్డు పల్లవోలు సురేష్ ,వజ్రమ్మ, కోటేశ్వరమ్మ, సుమతి ,తోడేటి వెంకటయ్య, తోడేటి పెంచలయ్య, మహేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పూనూరు రమేష్ ,ఆసిఫ్ ,రాసూరి రమణయ్య, పెంచల నాయుడు, వెంకటేశ్వర్లు, ప్రవీణ్ , సాగర్, కుమార్ ,నరేంద్ర, ప్రసాదు, గోపాల్, శేషారెడ్డి, రమణారెడ్డి, పి రమణయ్య, కొప్పోలు రమణయ్య, గోరీ షబ్బీర్, ఎస్ కే సాఫ్టజాన్ తదితరులు పాల్గొన్నారు.



