ANDHRABREAKING NEWSSTATE

బదిలీపై వెళ్తున్న ఏపిఎంకు ఘన సన్మానం

బదిలీపై వెళ్తున్న ఏపిఎం ఘన సన్మానం

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

ఏఎస్ పేట మండల ఏపిఎం గా గత మూడు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ బదిలీపై తిరుపతి జిల్లా గూడూరు కు వెళ్ళిన సిహెచ్ బుజ్జమ్మ ను ఏ.సి ఏరియా కోఆర్డినేటర్ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కెనరా బ్యాంకు మేనేజర్ షేక్ ఫయాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు గ్రూపులకు లోన్లు ఇప్పించడంలో వాటిని తిరిగి ఈ కట్టడంలో ఏపీఎం బ్యాంకు సిబ్బందికి మంచి సహాయ సహకారాలు అందించారని ఆయన కొనియాడారు. అలాగే సిబ్బంది మాట్లాడుతూ తమ అభివృద్ధికి ఏపీఎం ఎంతో కృషి చేశారని ఆమె బదిలీపై వెళ్లడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా ఏపిఎం బుజ్జమ్మ ను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ మాధవి సీసీలు ఏపీవో పొదుపు సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!