BREAKING NEWSPOLITICSSTATE

ఏఎస్ పేటలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఏఎస్ పేటలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

మండల కేంద్రమైన ఏఎస్ పేట మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ సిరాజ్
దర్గా ప్రధాన ద్వారం వద్ద భారీ కేకును కట్చేసి పరస్పరం తినిపించుకున్నారు
శుభాకాంక్షలు తెలుపుకున్నారు కేకును స్థానికులు చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మైనారిటీ సెల్ నాయకులు  డాక్టర్.ఖాజామియ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే చంద్రబాబునాయుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ హజరత్ వారిని ప్రార్థించమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలలో తమ మనుగడ కోల్పోయిందని 2024 లో తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని వారు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఏ యస్ పేట బిట్ 2 ఎంపిటిసి భర్త అఫ్జల్,తెలుగు యువత జిల్లా నాయకులు షేక్ ఖాదర్ బాషా , పోనుగొడు నాయకులు గంగవరపు సురేష్ నాయుడు, తాతి రెడ్డిపల్లి నాయకులు మల్లె చెంచురత్నం,ఏ యస్ పేట నాయకులు నీలం నారాయణ, మైనారిటీ నాయకులు షేక్ యస్ధాని,షేక్ నజీర్ అహ్మద్ పాన్ షాప్, షేక్ షానవాజ్,షఫీ, జి .మస్తాన్ మండల పార్టీ తెలుగు యువత నాయకులు షేక్ సద్దాం హుస్సేన్, అస్మత్, సోమిరెడ్డి ఇంద్ర సేన రెడ్డి,బొట్ట హరీష్ , నాయబ్, కాలేషా పార్టీ నాయకులు ,కార్యకర్తలు,యూత్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!