BREAKING NEWSCRIME

చుంచు ఎర్రగుడిలో కబడ్డీ పోటీలు ప్రారంభం

చుంచు ఎర్రగుడిలో కబడ్డీ పోటీలు ప్రారంభం

క్రిష్ణగిరి, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

మండల పరిధిలోని చుంచు ఎర్రగుడి గ్రామంలో కబడ్డీ పోటీలను వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి ,గ్రామ సర్పంచ్ మహాదేవమ్మ, ఎంపిటిసి రాజేష్, గ్రామ పెద్దలు తదితరులు బుధవారం ప్రారంభించారు. రెండు రోజులపాటు గ్రామంలో ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట, రామలింగేశ్వర స్వామి ముఖద్వారం ప్రారంభం, సుంకులమ్మ దేవాలయం నూతనంగా నిర్మించిన విగ్రహ ప్రతిష్ట ,నవగ్రహాలను వేద పండితుల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, రాతిదూలం పందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్తికొండ శాసనసభ్యులు శ్రీదేవి క్రిష్ణగిరి మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి తదితరులు నేడు హాజరుకానున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా క్రిష్ణగిరి ఎస్సై చంద్రశేఖర్రెడ్డి బందోబస్తు న ఏర్పాటు చేశాడు. గ్రామంలో లో సందడి నెలకొంది రెండు రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Related Articles

Back to top button
error: Content is protected !!