BREAKING NEWSPOLITICSSTATE

అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బుధవారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని అనంత కళాశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన మహానేత చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ భాష, టిడిపి మండల కన్వీనర్ బాచ్చాపురం శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి చాంద్ బాషా, సోముల శేఖర్ రెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, నన్నేబై గారి జిలాని తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!