BREAKING NEWSCRIME

బెల్లం ఊట ధ్వంసం

బెల్లం ఊట ధ్వంసం

అవుకు, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :

మండలంలోని పిక్కిల్ల పల్లి తాండ లో నాటుసారా బట్టీల పై మంగళవారం ఎస్సై జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అవుకు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ పిక్కిల్ల పల్లి తాండ వెలుపల ఉన్న కొండల్లో ఉన్న నాటుసారా బట్టీల పై దాడులు చేసి 20 డ్రమ్ములు, నిల్వ ఉన్న సుమారు 4000 లీటర్ల బెల్లం నేలపాలు చేసినట్లు తెలిపారు. బట్టీల వద్దే ఉన్న 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొండమ నాయుని పల్లి గ్రామానికి చెందిన పెద్దన్న, పాసి పెద్దన్న, బయన్న, మరియు పిక్కిల్ల పల్లి తండా కు చెందిన జయరాంనాయక్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ దాడులలో హెడ్కానిస్టేబుల్ ప్రసాదరావు ,వెంకటేష్ నాయక్, నందు నాయక్, మోహన్, నరేష్ కుమార్ రెడ్డి,హోంగార్డు చక్రి,లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!