BREAKING NEWSCRIME
నాటుసారా స్వాధీనం

నాటుసారా స్వాధీనం
చాగలమర్రి, ఏప్రిల్ ,20, (SK1 NEWS HD) :
మండలంలోని ఓజి తండా గ్రామంలో 35 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమణయ్య బుధవారం తెలిపారు . పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓజి తండా సమీపంలో నాటుసారా అక్రమంగా కాచుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు . గ్రామ సమీపంలో నాటుసారా బట్టీలను గుర్తించి 1500 ల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసామన్నారు. ఓజి తండా కు చెందిన భీముడు నాయక్ ను అదుపులోకి తీసుకుని 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని వివరించారు .ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.



