బాపులదొడ్డిలో సీనియర్ మేటిపై దాడి

బాపులదొడ్డిలో సీనియర్ మేటిపై దాడి
-: ఇద్దరిపై కేసు నమోదు
-: పోలీసు పికెటింగ్
పెద్దకడబూరు, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :
ఉపాధి హామీ పథకంలో హాజరు వేసే విషయంలో సీనియర్ మేటీ శ్రీకృష్ణతో మహదేవ, నర్సిరెడ్డిలు ఘర్షణకు దిగి దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామంలో బుధవారం చోటుచేసుకొంది. దీంతో శ్రీకృష్ణ వర్గీయులు, మహదేవ వర్గీయులు దాడి సిద్దమౌడంతో బాపులదొడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కోసిగి సీఐ ఎరిషావలి నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాసులు, ధనుంజయలు పోలీసు బృందంతో వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఉదయం ఉపాధి హామీ పని వద్ద సీనియర్ మేటీ శ్రీకృష్ణ హాజరు వేస్తుండగా మహదేవ, నర్సిరెడ్డిలు కలుగజేసుకొని ఎక్కువకి హాజరు వేయాలని వాదనకు దిగారు. పనికి వచ్చిన కూలీలకు మాత్రమే హాజరు వేస్తానని, పనికి హాజరుకాని కూలీలకు వేయనని మొండికేయడంతో ఘర్షణకు దారితీసి శ్రీకృష్ణపై దాడి చేశారు. విషయం గ్రామంలో శ్రీకృష్ణ బంధువులకు తెలియడంతో మహదేవ, నర్సిరెడ్డి వర్గీయులపై దాడికి సిద్ధమవుతుండగా అంతలో పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. గ్రామంలో ముందు జాగ్రత్తలలో భాగంగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసులు మహదేవ, నర్సిరెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



