
పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలలో గణనీయమైన పురోగతి చూపాలి
జగనన్న కాలనీల్లో అప్రోచ్ రోడ్డు పనులు వారం లోపు పూర్తి కావాలి
రోజువారీ లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకుని ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలి
పురోగతి పై ప్రతి వారం సమీక్షిస్తాం
వెనుకబడితే సహించేది లేదు
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 20, (SK1 NEWS HD) :
రోజువారీ లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకుని పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలలో గణనీయమైన పురోగతి చూపాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో హౌసింగ్ ,జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాల అమలుపై హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, ఈ ఈ లు, డి ఈ ఈలు, ఏ ఈ లు , ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ అధికారులతో డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద 49127 ఇ ళ్లను నిర్మించడం జరుగుతోందన్నారు . ఇందులో 395 లేఅవుట్లలో 35 372 ఇళ్లను, మిగిలిన 13755 ఇళ్లను పోసె షన్ సర్టిఫికెట్స్ మరియు సొంత స్థలాలలో నిర్మించడం జరుగుతోందన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షిస్తామని, పురోగతిలో వెనుకబడితే సహించేది లేదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఇంకా ప్రారంభించని ఇళ్లు, పునాది స్థాయి కంటే కింద ఉన్న ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారం లోపు గణనీయమైన పురోగతి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఆదోని డివిజన్ చాలా వెనుకబడి ఉందన్నారు.. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా వెంటనే తన పరిధిలోని డీలు ఏఈ లతో సమావేశమై ఒక ప్రణాళికను రచించుకొని అమలు చేయాలని ఆదోని డివిజన్ ఈ బాల వెంకటరెడ్డి ని కలెక్టర్ ఆదేశించారు. ఆదోని డివిజన్లో 4720 ఇళ్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని, వీటిని వెంటనే మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు .కర్నూలు డివిజన్లో 923, పత్తికొండ డివిజన్ లో 732 ఇళ్లను ఇంకా ప్రారంభించాల్సి ఉందని, వీటిని కూడా వెంటనే ప్రారంభించాలని ఆయా డివిజన్ల ఈ ఈ లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే పునాది స్థాయి కంటే కిందిస్థాయిలో ఆదోని డివిజన్ లో 17391, కర్నూల్ డివిజన్లో 5440, పత్తికొండలో 7351 ఇళ్లు ఉన్నాయని,వీటిని ఒక వారం లోపు పునాది స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు.. వచ్చే సమీక్ష నాటికి మ్యాపింగ్,జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ లు ఏవీ పెండింగ్ ఉండకూడదని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీల్లో అప్రోచ్ రోడ్లకు సంబంధించి 29 పనులను వారంలోపు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అలాగే భూమి చదునుకు సంబంధించిన నాలుగు పనులను కూడా వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంట్ గోడౌన్ల నిర్మాణాన్ని రేపు ప్రారంభించి 15 రోజుల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక,సిమెంట్,స్టీల్ సరఫరాలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పిడిని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణాలకు నీటి సరఫరాకు సంబంధించి ఎక్కడా నీటి ఇబ్బంది ఉండకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఆదోని అర్బన్ కాలనీ కి ఇటుకల సరఫరా కోసం నిర్మిత కేంద్రం లో ఇటుకల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని సంబంధిత ఏ ఈ ని కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్ని లేఅవుట్ల లో ఇటుకల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సంబంధిత వ్యక్తులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటుకల యూనిట్ తయారీకి కావలసిన సైటు నీరు విద్యుత్తును సరఫరా చేస్తామని అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. లేఔట్లకు దగ్గరలో ఇటుకల తయారీ యూనిట్లు ఉంటే, వాటిని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద డేటా ఎంట్రీ పంచాయతీ సెక్రెటరీ,విఆర్వో వాలిడేషన్ ప్రక్రియలను పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటనారాయణ, ఈ ఈ లు నాగరాజు, నాగేంద్రుడు బాల వెంకట రెడ్డి, డీ ఈలు, ఏ ఈ లు , ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.



