SPORTS
నాసా లో శ్రీ చైతన్య విద్యార్థుల హవా

నాసా లో శ్రీ చైతన్య విద్యార్థుల హవా
SK1 NEWS HD –
మాధవినగర్ కాలనీ యందు ఉన్న శ్రీ చైతన్య పాఠశాల K-4 లో నాసా ప్రాజెక్టు వర్క్ కు సంబంధించిన అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య పాఠశాల ఏ.జి.యమ్ సురేష్ విచ్చేసి విద్యార్థులను అభినందించారు. ఆర్.ఐ రామాంజనేయులు మాట్లాడుతూ నాసా స్పెస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2022 లో 66 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని తెలియజేశారు అలాగే ప్రిన్సిపల్ మెహముద గారు విద్యార్థుల కు పార్టీసీపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈకార్యక్రమంలో డీన్ దామోదర్, ఏ.ఓ ఫిరోజ్, నాసా ఇంఛార్జ్ వఖిల్, ప్రైమరీ ఇంఛార్జ్ లు కృష్ణవేణి, రోజా మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు



