ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…
గోనెగండ్ల , ఏప్రిల్ 05 , ( SK1 NEWS HD ) :
మండలకేంద్రమైన గోనెగండ్ల లో కులవివక్ష పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114 వ జయంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేవీపీఎస్ నాయకులు కరుణాకర్, ఆదిత్య నాటక రంగస్థల కళా మండలి సాంస్కృతిక శాఖ జిల్లా కార్యదర్శి కౌలుట్లయ్య,అడ్వకేట్ వెంకటేష్ లు మాట్లాడుతూ అందరినీ ఐక్యం చేసి బాబు జగ్జీవన్ రామ్,అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు గోనెగండ్లలో కొనసాగిస్తున్నామని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ గురించి చెప్పుకోవాలంటే 30 సంవత్సరాలు శాసనసభ లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్, అదేవిధంగా 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అంతేకాదు ఉపప్రధానిగా,వ్యవసాయ శాఖ ,కమ్యూనికేషన్స్ ,తంతి తపాలా, రక్షణ శాఖ,ఇలా ఎన్నో అత్యున్నత మైన పదవులు చేపట్టినా ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.దేశం ఇటువంటి మహానుభావుడికి భారతరత్న తో కీర్తించాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన స్వాతంత్ర సమర యోధుడు అని కొనియాడారు.అనంతరం బహుజనులకు కుడి కన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఎడమ కన్ను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ భర్త చంద్ర శేఖర్,కేవీపీఎస్ మండల కార్యదర్శి కరుణాకర్,డప్పు కళాకారుల సంఘం మండల కార్యదర్శి మారేష్,నాయకులు రంగన్న,రంగస్వామి, బాబు నాయుడు,ఆటో గౌడు,మునిస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



