
దిశ యాప్ రిజిస్ట్రేషన్ లు విరివిగా చేయించండి
దిశ యాప్ పై మహిళల్లో విస్తృతంగా అవగాహన చేయండి
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
అనంతపురం, ఏప్రిల్ 06, (SK1 NEWS HD) :
మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ ను విరివిగా రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశించారు. దిశ యాప్ ద్వారా ఆపద సమయాలలో ఎలా రక్షించుకోవచ్చో మహిళల్లో అవగాహన చేయాలన్నారు. మహిళల భద్రత/ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని… ఆపదల్లో ఉన్న మహిళల కోసం దిశ యాప్ రూపొందించి సేవలు అందిస్తోందన్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. SOS బటన్ నొక్కడం ద్వారా గానీ… ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఆ తర్వాత ఆపద/ ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది. తద్వారా పోలీసుల సేవలు వినియోగించుకుని రక్షణ పొందవచ్చన్నారు. ప్రతీ మహిళ/ అమ్మాయి దిశ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఆపద సమయంలో పోలీసుల సేవలు వినియోగించుకునేలా చైతన్యం చేయాలన్నారు.



